ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్(2017)లో..

మా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నుంచి 14 ప్రశ్నలు

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ప్రెసిషన్ అకాడమీ అందించిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నుంచి 14 ప్రశ్నలు వచ్చాయి. మా మెటీరియల్ చదివిన వారు ఈ 14 ప్రశ్నలకు సమాధానాలు కచ్చితంగా గుర్తించగలిగారు. ఏపీపీఎస్సీలో వచ్చిన ప్రశ్నలు, వాటికి సంబంధించి మా కరెంట్ అఫైర్స్ మెటీరియల్లో ఉన్న సమాచారం వివరాలు..

1. APPSC Group-1 Prelims (B series) Q.No. 08: కొత్త వస్తు, సేవల పన్ను బిల్లులు, 2017 కింద వస్తు సేవల పన్ను చట్టంలో విధించిన పరిమితులకు లోబడి, వస్తు వసేవల పన్ను రేట్లలో మార్పును సాధారణంగా ఎవరు చేస్తారు?

(1) ప్రకటన ద్వారా ప్రభుత్వం

(2) రాష్ట్రపతి ముందస్తు అంగీకారం ద్వారా ప్రభుత్వం

(3) సాధారణ బిల్లు ద్వారా పార్లమెంటు

(4) రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు

APPSC FINAL KEY: Ans 1.

Answer in Precision Acadamy material: August 2016 monthly Current Affairs s.no. 61.

జీఎస్టీ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు కోసం 101వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. సభకు హాజరైన సభ్యులంతా (443 మంది) బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.

జీఎస్టీ బిల్లు కేంద్ర ,రాష్ట్రాలలోని 17 రకాల పరోక్ష పన్నుల స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇది 2017, ఏప్రిల్ 1 నుండి ఇది అమలులోకి వస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర (ప్రభుత్వ) సభ్యులు ఉండే జీఎస్టీ మండలి జీఎస్టీ ధరలను నిర్ణయిస్తుంది.

2. APPSC Group-1 Prelims (B series) Q.No. 11: వివరణాత్మక పాత్రికేయతలో ప్రతిభకుగాను 2017 పులిట్జర్ బహుమతి ఎవరికి దక్కింది?


(1) ది న్యూయార్క్ టైమ్స్
(2) ది వాషింగ్టన్ పోస్ట్
(3) ది వికీ లీక్స్
(4) పరిశోధనాత్మక జర్నలిస్టుల అంతర్జాతీయ కన్సార్షియం(ఐసీఐజే)

APPSC FINAL KEY: Ans 4.

Answer in Precision Acadamy material: April 2017 monthly Current Affairs s.no. 130.

కోల్సన్ వైట్ హెడ్ నవలకు పులిట్జర్ బహుమతి

 న్యూయార్క్ కు చెందిన నవలా రచయిత కోల్సన్ వైట్ హెడ్ రచించిన ప్రఖ్యాత నవల ద అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ కు ఫిక్షన్ విభాగంలో 2017 పులిట్జర్ బహుమతి దక్కింది. స్వేచ్ఛను ఊహించుకుంటూ పారిపోయిన ఒక బానిస, కఠోర వాస్తవాలను ఈ నవల చిత్రించింది. గత 20 ఏళ్లలో ఈ విభాగంలో అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా కోల్సన్ నిలిచారు. ఈ పుస్తకానికి అమెరికా నేషనల్ బుక్ ఆఫ్ అవార్డు కూడా గతేడాది లభించింది.

 2017 విజేతలు: ఫిక్షన్: ద అండర్ గ్రౌండ్ రైల్ రోడ్; డ్రామా: స్వెట్ (రచయిత లిన్ నోటేజ్); హిస్టరీ: బ్లడ్ ఇన్ ద వాటర్: ద అటికా ప్రిజన్ అప్రైజింగ్ ఆఫ్ 1971 అండ్ ఇట్స్ లెగసీ(హీథర్ యాన్ థామ్సన్); బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ: ద రిటర్న్: ఫాదర్స్, సన్స్ అండ్ ద ల్యాండ్ ఇన్ బిట్వీన్(హిషం మతర్); పోయెట్రీ: ఓలియో(టైహింబా జెస్); జెనరల్ నోటిఫికేషన్: ఎవిక్టెడ్: పావర్టీ అండ్ ప్రాఫిట్ ఇన్ ద అమెరికన్ సిటీ(మాథ్యూ డెస్మండ్); మ్యూజిక్: ఏంజెల్స్ బోన్(డూ యున్); జర్నలిజం, పబ్లిక్ సర్వీస్: న్యూయార్క్ డైలీ న్యూస్ మరియు ప్రోపబ్లికా. ఎక్స్ ప్లనేటరీ రిపోర్టింగ్: ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ICIJ), మెక్ క్లాచీ మరియు మియామీ హెరాల్డ్(300 మంది రిపోర్టర్ల సాయంతో పనామా పత్రాలను వెలికితీసినందుకు) .

 అమెరికన్ హంగేరియన్ పత్రికా ప్రచురణకర్త జోసెఫ్ పులిట్జర్ ఈ అవార్డులను 1917లో నెలకొల్పారు. దినపత్రికలు, ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత రంగాల్లో మొత్తం 21 విభాగాల్లో కొలంబియా యూనివర్సిటీ ద్వారా అవార్డులను అందజేస్తారు. ఒక్కో విజేతకు 15 వేల డాలర్లు అందజేస్తారు. పబ్లిక్ సర్వీస్ కేటగిరీ విజేతకు స్వర్ణ పతకం ఇస్తారు.

3. APPSC Group-1 Prelims (B series) Q.No. 12: ఇటీవల జరిగిన సూపర్ సిరీస్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?

(1) కిడాంబి శ్రీకాంత్
(2) బి. సాయి ప్రణీత్
(3) పారుపల్లి కశ్యప్
(4) బి.సుమిత్ రెడ్డి
APPSC FIANAL KEY: Ans 2. 

Answer in Precision Acadamy material: April 2017 monthly Current Affairs s.no. 144.

సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన బి. సాయి ప్రణీత్

 ఇండియన్ షట్లర్ బి. సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలుపొందాడు. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నెం. 29 ర్యాంకు క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ పై అతడు 17-21, 21-17, 21-12 స్కోరుతో ఈ టైటిల్ నెగ్గాడు. చరిత్రాత్మకమైన ఈ సిరీస్ ఫైనల్ లో అందరూ భారతీయ ఆటగాళ్లే పోటీ పడటం విశేషం.

 ప్రణీత్ కు ఇది కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్. వరల్డ్ నెం. 30 ర్యాంకు ఆటగాడైన ప్రణీత్ గతేడాది కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గెలుపొందాడు. ఈ ఏడాది సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ లో ఫైనల్ కు చేరాడు. కాగా, సింగపూర్ ఓపెన్ సిరీస్ విజేతకు $350,000 నగదు బహుమతి అందజేస్తారు.

4.APPSC Group-1 Prelims (B series) Q.No. 36: భారత్ లో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఈ సందర్భంగా జరుపుతారు?

(1) మొక్కలకు ప్రాణముందని జేసీ బోస్ కనిపెట్టిన రోజు
(2) ఆర్యభట్ట ఉపగ్రహం ప్రయోగం జరిగిన రోజు
(3) మొదటి అణు రియాక్టర్ అప్సర ప్రారంభమైన రోజు
(4) సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు

APPSC FIANAL KEY: Ans 4.

Answer in Precision Acadamy material: February 2017 monthly Current Affairs s.no. 134.

ఫిబ్రవరి 28:జాతీయ సైన్స్ దినోత్సవం

 ప్రఖ్యాత భారత భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్ 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నారు. భౌతిక శాస్త్రంలో కీలకమైన ఈ విజయానికి గాను రామన్ కు 1930లో నోబెల్ బహుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఆ విజయానికి గుర్తుగా 1999 నుంచి ఏటా ఈ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ రోజున విద్యాసంస్థల్లో సైన్స్ సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 2017 థీమ్: Science and Technology for Specially Abled Persons

5.APPSC Group-1 Prelims (B series) Q.No. 37: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు నీరు-చెట్టు కార్యక్రమంలో కిందివాటిలో ఏ రకం కార్యక్రమాలు చేపడుతున్నారు?


(1) ప్రభుత్వ భవనాల్లో చెట్లు నాటడం
(2) చిన్న తరహా చెరువులు, కాలువల్లో పూడిక తీయడం
(3) పార్కుల అభివృద్ధి
(4) వనమహోత్సవ కార్యక్రమం
APPSC FIANAL KEY: Ans 2.

Answer in Precision Acadamy material: May 2016 monthly Current Affairs s.no. 237.

నీరు -చెట్టు

 నీరు-చెట్టు కార్యక్రమాన్ని తంబళ్లపల్లి నియోజకవర్గంలోని గుమ్మసముద్రంలో ప్రారంభించారు. భూగర్భజలాల పెంపు, జలసంరక్షణ, సమర్ధ నీటి నిర్వహణ ద్వారా పర్యావరణాన్ని కాపాడడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.

6. APPSC Group-1 Prelims (B series) Q.No. 40: టిబి (క్షయ) బాసిల్లస్ ను ఎవరు కనిపెట్టారు?


(1) ఎడ్వర్డ్ జెన్నర్
(2) రాబర్ట్ కోక్
(3) లూయీ పాశ్చర్
(4) రోనాల్డ్ రాస్
APPSC FIANAL KEY: Ans 2.

Answer in Precision Acadamy material: March 2017 monthly Current Affairs s.no. 114.

మార్చి 24: ప్రపంచ క్షయ దినం

 క్షయవ్యాధిపై అవగాహన కల్పించడం, వ్యాధి నిర్మూలన కోసం ఏటా మార్చి 24న ప్రపంచ క్షయ దినం(World Tuberculosis Day)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తోంది. కాగా, 2012లో 86 లక్షల మంది టీబీ బారిన పడగా, 13 లక్షల మంది చనిపోయారు. వీరిలో అత్యధికులు మూడో ప్రపంచ దేశాలకు చెందినవారే ఉన్నారు.

 క్షయ వ్యాధికి టీబీ బాసిల్లస్ బ్యాక్టీరియానే కారణమని కనుగొన్నట్లు డాక్టర్ రాబర్ట్ కోచ్ 1882, మార్చి 24న యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ లో ప్రకటించారు. దీనికి గుర్తుగా ఏటా క్షయ దినం పాటిస్తున్నారు.

 2017 థీమ్: క్షయ అంతం కోసం ఏకమవుదాం(Unite to End TB).

7.APPSC Group-1 Prelims (B series) Q.No. 58: చైనా నుంచి లండన్ కి జనవరి, 2017లో మొదటి ప్రయాణం చేసిన సరుకు రవాణా రైలు పేరు ఏమిటి?


(1) సిల్క్ రైలు
(2) పశ్చిమ
(3) చైనా గాలి
(4) తూర్పు గాలి
APPSC FIANAL KEY: Ans 4.

Answer in Precision Acadamy material: April 2017 monthly Current Affairs s.no. 15.

చైనా-లండన్ గూడ్స్ రైలు తొలి యాణం పూర్తి

 చైనాలోని యివూ సిటీ నుంచి లండన్ కు వెళ్లిన తొలి గూడ్స్ రైలు ఈస్ట్ విండ్(తూర్పు గాలి) 20 రోజుల అనంతరం ఏప్రిల్ 29న తిరిగి చైనాకు చేరుకుంది. మొత్తం 12 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ రైలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ధ రైల్వే మార్గంలో ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సిల్క్ రోడ్ మార్గంతో పాటు పశ్చిమ యూరోప్ తో వాణిజ్య సంబంధాల మెరుగుదల కోసం ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలులో 30 కంటెయినర్లలో సాఫ్ట్ డ్రింక్స్, విటమిన్స్, బేబీ ప్రొడక్ట్స్, ఔషధాలు, యంత్రాలు, బేబీ మిల్క్, విస్కీ వంటి వాటిని రవాణా చేశారు. ఈ రైలు ఏడు దేశాల(ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, కజకిస్థాన్) మీదుగా ప్రయాణించింది. నౌకల ద్వారా సరుకు రవాణా కంటే ఈ రైలు ద్వారా 30 రోజులు వేగంగా రవాణా చేయవచ్చు.

8. APPSC Group-1 Prelims (B series) Q.No. 59: అందరి కన్నా ఎక్కువ అంతరిక్ష నడకలు నడిచిన మహిళగా రికార్డ్ సాధించిన వ్యోమగామి ఎవరు?

(1) పెగ్గీ విట్సన్
(2) సునీతా విలియమ్స్
(3) స్వేత్లానా స్వావిత్స్కాయ
(4) శాల్లీ రైడ్
APPSC FIANAL KEY: Ans 1.

Answer in Precision Acadamy material: April 2017 monthly Current Affairs s.no. 73.

పెగ్గీ విట్సన్ కొత్త అంతరిక్ష రికార్డు

 అంతరిక్షంలో అత్యధిక కాలం ఉన్న అమెరికా మహిళా వ్యోమగామిగా పెగ్గీ విట్సన్ రికార్డు నెలకొల్పారు. ఇదివరకు ఈ రికార్డు జెఫ్ విలియమ్స్(534 రోజులు) పేరిట ఉండగా, విట్సన్ ఏప్రిల్ 24న దానిని అధిగమించారు. ప్రస్తుత రోదసి యాత్ర పూర్తయేసరికి అంతరిక్షంలో ఆమెకు 600 రోజులు పూర్తవుతాయి. అంతరిక్షంలో అత్యధిక సార్లు నడిచిన, ఐఎస్ఎస్ కు రెండు సార్లు కమాండర్ గా పనిచేసిన మహిళగా కూడా విట్సన్ రికార్డులు సాధించారు.

9.APPSC Group-1 Prelims (B series) Q.No. 61: యునెస్కో నిర్వహించిన మానవాళికి చెందిన అగోచర సాంస్కృతిక వారసత్వ సంపదల పట్టికల్లో 2016లో చేర్చబడింది, ఈ క్రిందివాటిలో ఏది?


(1) సంకీర్తన
(2) వేదోచ్చారణ సంప్రదాయం
(3) రామ్ లీలా
(4) యోగా
APPSC FIANAL KEY: Ans 4.

Answer in Precision Acadamy material: December 2016 monthly Current Affairs s.no. 26.

యునెస్కో సాంస్కృతిక వారసత్వ అంశాల జాబితాలో యోగా

 భారతీయ సనాతన విద్య అయిన యోగాకు యునెస్కో స్పృషించలేని (అగోచర) సాంస్కృతిక వారసత్వ అంశాల జాబితాలో చోటు లభించింది. ఇథియోపియాలోని ఆడిస్ అబాబాలో జరిగిన 11వ అంతర్ ప్రభుత్వ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం ఆమోదం పొందింది. యునెస్కో స్పృషించలేని సాంస్క్రుతిక వారసత్వ జాబితాలో చోటు లభించిన 13వ భారత అంశంగా యోగా నిలిచింది. ఇంతకుముందు చౌ డ్యాన్స్, లడఖ్ బుద్ధిస్ట్ మంత్ర పఠనం, సంకీర్తన, మణిపూర్ డ్యాన్స్, రామ్ లీలా నృత్యంకి చోటు దక్కింది.

10.APPSC Group-1 Prelims (B series) Q.No. 66: క్రిందివారిలో జాతీయ క్రీడల ప్రాధికార సంస్థ బోర్డులో ఇటీవల సభ్యునిగా/సభ్యురాలిగా నియమించబడిన క్రీడాకారుడు/క్రీడాకారిణి ఎవరు?

(1) పుల్లెల గోపీచంద్
(2) కరణం మల్లేశ్వరి
(3) ముఖేష్ కుమార్
(4) గుత్తా జ్వాల
APPSC FIANAL KEY: Ans 4.

Answer in Precision Acadamy material: March 2017 monthly Current Affairs s.no. 122.

స్పోర్ట్స్ థారిటీ ఆఫ్ ఇండియా పాలక మండలి సభ్యురాలిగాజ్వాల

 బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) పాలక మండలి సభ్యురాలిగా నియమితులయ్యారు. జ్వాల 14 సార్లు జాతీయ చాంపియన్ గా నిలిచింది. 2011 వరల్డ్ చాంపియన్షిప్లో ఆమె కాంస్యం గెలిచింది. 2010లో ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ గా, 2014లో గ్లాస్గో గేమ్స్ ఉమెన్స్ డబుల్స్ రజత పతక విజేతగా నిలిచింది.

11.APPSC Group-1 Prelims (B series) Q.No. 69: IISF న్యూఢిల్లీలో నిర్వహించిన రైఫిల్/ పిస్టల్/షాట్ గన్ ప్రపంచ పోటీల్లో స్వర్ణ పతకం గెలిచిన భారతీయ షూటర్? <.p> (1) అమన్ ప్రీత్ సింగ్
(2) అంకుర్ మిత్తల్
(3) జీతు రాయ్
(4) పూజ ఘట్కర్
APPSC FIANAL KEY: Ans 3.

Answer in Precision Acadamy material: March 2017 monthly Current Affairs s.no. 117.

ఢిల్లీ షూటింగ్ వరల్డ్ కప్ లో జీతూ రాయ్ కి స్వర్ణం

 న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ISSF) వరల్డ్ కప్ లో భారత షూటర్ జీతూ రాయ్ 50 మీ. ఫ్రీ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం గెలుపొందారు. ఫైనల్ లో 230.1 పాయింట్లు సాధించడం ద్వారా జీతూ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కాగా, ఈ వరల్డ్ కప్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకూ జరిగింది. మరో భారత షూటర్ అమన్ ప్రీత్ సింగ్ ఇదే విభాగంలో రజతం గెలుపొందారు. ఇంతకుముందు వరల్డ్ కప్ లో జీతూ 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం గెలిచాడు. మిక్స్డ్ టీం ఈవెంట్లో హీనా సిద్ధుతో కలిసి స్వర్ణం గెలిచాడు.

12.APPSC Group-1 Prelims (B series) Q.No. 77: 2016-17లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మొత్తం ప్రత్యేక సహాయం అందించింది?

(1) రూ. 4,058.04 కోట్లు
(2) రూ. 1,976.50 కోట్లు
(3) రూ. 1,176.50 కోట్లు
(4) రూ. 2,081.54 కోట్లు
APPSC FIANAL KEY: Ans 2.

Answer in Precision Acadamy material: August 2016 monthly Current Affairs s.no. 177.

ఏపీకి 1976.50 కోట్ల కేంద్ర సాయం

 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏపీకి 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,976.50 కోట్లను సాయంగా ప్రకటించింది.

13.APPSC Group-1 Prelims (B series) Q.No. 115: భారత్లోని ఏ ఎన్నికల్లో మొదటిసారిగా ప్రయోగాత్మక పద్ధతిలో EVPATని ఉపయోగించారు?

(1) 2013 నాగాలాండ్ ఉప ఎన్నికల్లో
(2) 2014 లోక్ సభ ఎన్నికల్లో
(3) 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో
(4) 2017 మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో
APPSC FIANAL KEY: Ans 1.

Answer in Precision Acadamy material: 5 Star Challenge Daily Current Affairs Election Commission requested government for the procurement of VVPAT(Voter Verifiable Paper Audit Trial ) machines for 2019 Loksabha elections . Which of the following state is the first one in India saw the implementation of VVPAT in 2017 assembly elections of the entire state?

a) Himachal Pradesh
b) Manipur
c) Uttar Pradesh
d) Goa
Ans : D

Recently , Election Commission has sent a fresh reminder to the law ministry seeking "urgent" sanction of funds for procurement of voter-verifiable paper audit trail (VVPAT) in time to hold the 2019 Lok Sabha elections.
Voter-verified paper audit trail was first used in an election in India in September 2013 in Noksen (Assembly Constituency) in Nagaland. VVPAT -fitted EVMs was used in entire Goa state in the 2017 assembly elections, which was the first time that an entire state in India saw the implementation of VVPAT. VVPAT is a method of providing feedback to voters using a ballotless voting system.

14.APPSC Group-1 Prelims (B series) Q.No. 149: ఎవరి సిఫారసుల మేరకు అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేశారు?

(1) వెంకటాచలయ్య కమిషన్
(2) సర్కారియా కమిషన్
(3) ఎం.ఎం. పూంఛీ కమిషన్
(4) రాజమన్నార్ కమిషన్
APPSC FIANAL KEY: Ans 2.

Answer in Precision Acadamy material: July 2016 monthly Current Affairs s.no. 43.

ఢిల్లీలో 11వ అంతరాష్ట్రమండలి సమావేశం

11వ అంతరాష్ట్ర మండలి సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జూలై 16న ఢిల్లీ లో ప్రారంభించారు. ఈ సమావేశంలో అంతరాష్ట్ర సంబంధాలు, అంతర్గత భద్రత, SC and ST ల పైన అకృత్యాల గురించి చర్చించారు.

10 సంవత్సరాల తర్వాత ఈ సమావేశం జరిగింది.

 అంతరాష్ట్ర మండలి రాజ్యాంగ బద్ద సంస్థ. ప్రకరణ 262 కింద పొందు పరచడం జరిగింది. రాష్ట్రాల మధ్య దర్యాప్తు విధానాలు, వివాదాల గురించి చర్చించడం కోసం సర్కారియా కమిషన్ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్మెన్: ప్రధాన మంత్రి, సభ్యులు: అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు అడ్మినిస్ట్రేటర్లు. కాబినెట్ రాంక్ కలిగిన ఆరుగురు సభ్యులు.


టీఎస్పీఎస్సీ గురుకుల టీజీటీ, పీజీటీ స్క్రీనింగ్ టెస్టు(31-05-2017)లో..మా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నుంచి 5 ప్రశ్నలు .


టీఎస్పీఎస్సీ గురుకుల పీజీటీ, టీజీటీ స్క్రీనింగ్ టెస్టులో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి సుమారు 10 ప్రశ్నలు వచ్చాయి. వీటిలో ప్రెసిషన్ అకాడమీ అందించిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నుంచి 5 ప్రశ్నలు వచ్చాయి. మా మెటీరియల్ చదివిన వారు ఈ ప్రశ్నలకు సమాధానాలు కచ్చితంగా గుర్తించగలిగారు. గురుకుల స్క్రీనింగ్ టెస్టులో వచ్చిన ప్రశ్నలు, వాటికి సంబంధించి

మా కరెంట్ అఫైర్స్ లో ఉన్న సమాచారం వివరాలు..

1. TSPSC Gurukula PGT-TGT Screenint Test (A series) Q.No. 1:
Match the following:
A. Chintakindi Mallesham       1.Social Work
B. Daripalli Ramaih                 2.Science & Engineering
C. M.A.Waheed                      3.Art & Culture
D. Aekka YadagiriRao            4.Medicine

Select the correct answer from the codes given below:
(1) A-3; B-1; C-2; D-4
(2) A-2; B-4; C-1; D-3
(3) A-2; B-1; C-4; D-3
(4) A-3; B-2; C-4; D-1

TSPSC KEY: Ans 3.

Answer in Precision Acadamy material: January 2017 monthly Current Affairs s.no. 124.

2017 పద్మ అవార్డుల ప్రకటన

దేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను 2017కు గాను కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన 89 మంది ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఏడుగురికి పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందికి పద్మ శ్రీ అవార్డులు లభించాయి. అవార్డు విజేతల్లో 19 మంది మహిళలు, ప్రవాస భారతీయులు, విదేశీయులు ఐదుగురు ఉన్నారు. ఆరుగురికి మరణానంతరం ఈ అవార్డులు ప్రకటించారు. పద్మ విభూషణ్: కేజే ఏసుదాసు, సద్గురు జగ్గీవాసుదేవ్, శరద్ పవార్, మురళీ మనోహర్ జోషి, యూఆర్ రావు, సుందర్ లాల్ పట్వా(మరణానంతరం), పీఏ సంగ్మా(మరణానంతరం). పద్మ భూషణ్: విశ్వమోహన్ భట్, దేవీప్రసాద్ ద్వివేదీ, తెహెమ్ తోన్ ఉద్వదియా, రత్నసుందర్ మహరాజ్, స్వామి నిరంజనానంద సరస్వతి, మహాచక్రి సిరింథ్రోన్(థాయిలాండ్ ప్రిన్సెస్), చో రామస్వామి (మరణానంతరం).

పద్మ శ్రీ: తెలంగాణ నుంచి గ్రహీతలు: ప్రొఫెసర్ ఎక్కా యాదగిరి రావు(కళలు శిల్పి), త్రిపురనేని హనుమాన్ చౌదరి (సివిల్ సర్వీస్), : డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్(వైద్యం), చంద్రకాంత్ పితవా(సైన్స్ అండ్ ఇంజనీరింగ్), : దరిపల్లి రామయ్య(సామాజిక సేవ), బీవీఆర్ మోహన్ రెడ్డి(వాణిజ్యం, పరిశ్రమలు). ఏపీ నుంచి: : చింతకింది మల్లేశం(సైన్స్ అండ్ ఇంజనీరింగ్; స్వస్థలం తెలంగాణ. అవార్డు ఏపీ కోటాలో వచ్చింది), వి. కోటేశ్వరమ్మ(సాహిత్యం, విద్య).

2.TSPSC Gurukula PGT-TGT Screenint Test (A series)
Q.No. 3: Aproject to tackle climate change has been decided to be implemented in the erstwhile Mahabubnagar district areas. It will be executed combined by

(1) EPTRI, T.S. Department of Agriculture, NABARD, ICRISAT & Prof. Jaya Shankar T.S. Agriclutural University
(2) World Bank, EPTRI, T.S. Department of Agriculture
(3) The IBRD, T.S. Department of Agriculture, ICRISAT
(4) ICRISAT, Asian Developement Bank, FAO, and T.S. Department of Agriculture

TSPSC KEY: Ans 1.

Answer in Precision Acadamy material: April 2017 monthly Current Affairs s.no. 188.

వాతావరణ మార్పు నివారణకు పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు

కరువు పీడిత జిల్లాగా మారిన మహబూబ్ నగర్ జిల్లాలో వాతావరణ మార్పు సంబంధిత సమస్యలను ఎదుర్కొనేందుకు గాను కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. మహబూబ్ నగర్ తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో చేపట్టే ఈ ప్రాజెక్టును ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్(EPTRI), రాష్ట్ర వ్యవసాయ శాఖ, నాబార్డ్, ఇక్రిశాట్, ప్రొఫెసర్ జయశంకర్ టీఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీనికి రూ. 24 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతి 2 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమించి, నాలుగేళ్ల పాటు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

3.TSPSC Gurukula PGT-TGT Screenint Test (A series)
Q.No. 7: India has successfully tested the following supersonic cruise missile with range of 400 km in the month of March, 2017.
(1) Akash
(2) BrahMos
(3) Kalvari
(4) Agni-VI
TSPSC KEY: Ans 2.
Answer in Precision Acadamy material: March 2017 monthly Current Affairs s.no. 52.

భూతల దాడులు చేసే బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన నేవీ ్రాజెక్టు

ుద్ధనౌకల నుంచి భూతల దాడులు చేసే బ్రహ్మోస్ క్షిపణిని తొలిసారిగా భారత నావికాదళం బంగాళాఖాతంలోని ఓ నౌక నుంచి విజయవంతంగా పరీక్షించింది. రష్యాకు చెందిన యఖోంత్(పీ800 ఆనిక్స్) క్షిపణుల ఆధారంగా బ్రహ్మోస్ క్షిపణులను రష్యా సహకారంతో భారత్ తయారు చేసింది. ఈ క్షిపణుల పరిధి 290 కి.మీ. గతేడాది క్షిపణి సాంకేతికత నియంత్రణ ఒప్పందంలోకి భారత్ ప్రవేశించినందున, పరిధిని 450 కి.మీ. వరకూ పెంచేందుకు వీలైంది.

4. TSPSC Gurukula PGT-TGT Screenint Test (A series)
Q.No. 9: Who won the Australian Grand Prix-2017?
(1) Sebastian Vettel
(2) Marc Leishman
(3) Roger Federer
(4) Andy Murray
TSPSC KEY: Ans 1.
NOTE: Federer won the Australian Open Grand prix-2017(Tennis)
nswer in Precision Acadamy material: April 2017 monthly Current Affairs s.no. 156.

ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2017 విజేత సెబాస్టియన్ వెటెల్
 2017 ఫార్ములా వన్ రోలెక్స్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ను జర్మనీకి చెందిన సెబాస్టియన్ వెటెల్ సొంతం చేసుకున్నాడు. మెల్ బోర్నులో మార్చి 26న జరిగిన ఫైనల్ రేసులో మెర్సిడెస్ డ్రైవర్ లెవిస్ హమిల్టన్ పై ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ విజయం సాధించాడు.

5.TSPSC Gurukula PGT-TGT Screenint Test (A series)
Q.No. 10: The 89th Oscar Awards were presented in the month of February, 2017 in Los Angeles, USA. The Oscar Award for Best Picture was given to
(1) The White Helmets
(2) Moon Light
(3) Son of Soul
(4) Made in America

TSPSC KEY: Ans 2.
Answer in Precision Acadamy material: March 2017 monthly Current Affairs s.no. 116.

89వ ఆస్కార్ అవార్డులు ప్రదానం

89వ అకాడమీ(ఆస్కార్) అవార్డులను ఫిబ్రవరి 27న లాస్ ఏంజెలిస్ లోని హాలివుడ్ లో గల డాల్బీ థియేటర్లో ప్రదానం చేశారు. 2016లో వచ్చిన సినిమాలకు సంబంధించి అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మొత్తం 24 విభాగాల్లో ఈ అవార్డులను ప్రకటించింది.

లా లా లాండ్ 14 విభాగాల్లో నామినేట్ కాగా, ఆరు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది.

విజేతలు: ఉత్తమ చిత్రం: మూన్ లైట్; ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్); ఉత్తమ నటుడు: క్యాజీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ); ఉత్తమ దర్శకుడు: డామియెన్ చాజెల్లే(లా లా లాండ్, 32 ఏళ్లకే ఆస్కార్ అందుకుని, అతి పిన్న దర్శకుడిగా నిలిచారు).

ఇటీవల కన్ను మూసిన భారతీయ నటుడు ఓం పురి, స్టార్ వార్స్ నటి క్యారీ ఫిషర్, డెబీ రేనాల్డ్స్, బిల్ పాక్స్టన్ వంటి దివంగత నటులను అవార్డుల వేదికపై ప్రత్యేకంగా స్మరించుకున్నారు.

అకాడమీ అవార్డులను 1929లో మొదటిసారిగా ప్రదానం చేశారు.


టీఎస్పీఎస్సీ గురుకుల పీజీటీ, టీజీటీ లాంగ్వేజెస్ స్క్రీనింగ్ టెస్టు(14-06-2017)లో..మా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నుంచి 7 ప్రశ్నలు


టీఎస్పీఎస్సీ గురుకుల పీజీటీ, టీజీటీ లాంగ్వేజెస్ స్క్రీనింగ్ టెస్టులో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి సుమారు 12కు పైగా ప్రశ్నలు వచ్చాయి. వీటిలో ప్రెసిషన్ అకాడమీ అందించిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ నుంచి 7 ప్రశ్నలు వచ్చాయి. మా మెటీరియల్ చదివిన వారు ఈ ప్రశ్నలకు సమాధానాలు కచ్చితంగా గుర్తించగలిగారు. గురుకుల స్క్రీనింగ్ టెస్టులో వచ్చిన ప్రశ్నలు, వాటికి సంబంధించి మా కరెంట్ అఫైర్స్ లో ఉన్న సమాచారం వివరాలు..


1. TSPSC Gurukula PGT-TGT Languages Screenint Test (A series) Q.No. 1: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా నదులపై ఏ మూడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని ఒప్పందంపై సంతకాలు చేశాయి?

1.తుమ్మిడిహట్టి, మేడిగడ్డ మరియు ఛనక కొరాట ప్రాజెక్టులు

2. తుమ్మిడిహట్టి, ఏలేశ్వరం మరియు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు

3. మేడిగడ్డ, ఏలేశ్వరం మరియు ఛనక కొరాట ప్రాజెక్టులు

4. మేడిగడ్డ, కాళేశ్వరం మరియు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు

TSPSC KEY: Ans 1.


Answer in Precision Acadamy material: August 2016 monthly Current Affairs s.no. 166.

3 సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం
గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా నదులపై నిర్మించనున్న 3 సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు కుదర్చుకున్నాయి. ఆగస్టు 24న ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒఫ్పందాల ప్రకారం.. రెండు రాష్ట్రాలు కలిసి గోదావరి, దాని ఉపనదులపై తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, చనాక కొరటా బ్యారేజీలను చేపట్టనున్నాయి.

2. TSPSC Gurukula PGT-TGT Languages Screenint Test (A series) Q.No. 2: ఇటీవల హిందూ వివాహ బిల్లు, 2017 పేరుతో మొదటిసారిగా సవివరమైన హిందూ కమ్యూనిటీ ప్రజల వ్యక్తిగత చట్టంగా ఈ కింద తెలిపన ఏ దేశపు సెనేట్ ఆమోదించింది?

1.బంగ్లా దేశ్

2. చైనా

3. పాకిస్తాన్

4. బ్రిటన్

TSPSC KEY: Ans 3.

Answer in Precision Acadamy material: March 2017 monthly Current Affairs s.no. 15.

పాకిస్థాన్లో హిందూ వివాహ బిల్లును ఆమోదించిన పార్లమెంటు

పాకిస్థాన్లో హిందూ మైనారిటీ ప్రజల వివాహాల నియంత్రణకు సంబంధించిన కీలక బిల్లు Hindu Marriage Bill 2016ను ఆ దేశ పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. దీంతో హిందువులకు సమ్మతమైన సమగ్ర కుటుంబ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది.

మైనారిటీల కోసం పాక్ లో తెచ్చిన మొదటి పర్సనల్ లా ఇది. పాస్ పోర్టులు, ఇతర అధికారిక పత్రాల కోసం హిందూ స్త్రీలు తమ వివాహానికి సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాల్సి ఉండగా, ఇదివరకు ధ్రువపత్రాలు ఇచ్చేవారు కాదు. తాజా చట్టం ద్వారా ఇకపై ధ్రువపత్రాలు అందజేస్తారు.

వివాహ నమోదు, విడాకుల మంజూరు వంటి వాటికి ఇందులో సమగ్ర నిబంధనలు చేర్చారు.

పాక్ హిందువుల్లో పెరుగుతున్న అభద్రతా భావాన్ని తొలగించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు.

>3. TSPSC Gurukula PGT-TGT Languages Screenint Test (A series) Q.No. 3: భారతీయ స్టేట్ బ్యాంకులో కొన్ని బ్యాంకుల విలీనంపై కింది వాక్యాలను పరిశీలింపుము.

A. బ్యాంకుల విలీనంపై కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 2017లో నిర్ణయం తీసుకుంది.

B. 1 ఏప్రిల్, 2017 నుంచి మొత్తం ఐదు బ్యాంకులు ఎస్బీఐలో విలీనం అయినాయి

C. ఈ ఐదు బ్యాంకులలో రెండు ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు కావు

D. ఒక ఎస్బీఐ అనుబంధ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా విలీనాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు

TSPSC KEY: Ans 3.

Answer in Precision Acadamy material: April 2017 monthly Current Affairs s.no. 58.

ఎస్బీఐలో ఆరు బ్యాంకుల విలీనం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దానికి అనుబంధంగా ఉన్న ఐదు బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు ఏప్రిల్ 1న విలీనం అయ్యాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులున్న టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ నిలిచింది.

తాజా విలీనం వల్ల ఎస్బీఐ 37 కోట్ల మంది ఖాతాదారులు, 24 వేల శాఖలు, 59 వేల ఏటీఎంలతో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. దీంతోపాటు ఎస్బీఐ డిపాజిట్లు రూ. 26 లక్షల కోట్లకు, అడ్వాన్సెస్ లెవల్ నిల్వలు రూ. 18.50 లక్షల కోట్లకు చేరాయి.

విలీనమైన బ్యాంకులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, భారతీయ మహిళా బ్యాంకు.

ఎస్బీహెచ్: హైదరాబాద్ స్టేట్ బ్యాంకు పేరుతో దీనిని 1941లో ఏడో (ఆఖరి) నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏర్పాటు చేశారు. 1956లో ఎస్బీఐకి అనుబంధంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గా మారి, అందులో అతిపెద్ద అనుబంధ బ్యాంకుగా నిలిచింది.

4. TSPSC Gurukula PGT-TGT Languages Screenint Test (A series) Q.No. 6: వరిష్ట పెన్షన్ బీమా యోజన, 2017కు సంబంధించి ఈ కింది వివరాలు పరిశీలించండి:
A. ఈ పథకాన్ని టాటా ఏఐఏ జీవిత బీమా కంపెనీ లిమిటెడ్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తారు.
B. ఈ పథకం సంవత్సరానికి ఎనిమిది శాతం చొప్పున పది సంవత్సరాలు గ్యారంటీ రిటర్ను రేటు ఆధారంగా పెన్షన్ ను తప్పనిసరిగా అందిస్తుంది.
పైన తెలిపిన వివరాలలో ఏది సరైనది?/ఏవి సరైనవి?

1. A మాత్రమే

2. B మాత్రమే

3. A, B సరైనవి

4. A. B సరైనవి కావు

TSPSC KEY: Ans 2.

Answer in Precision Acadamy material: January 2017 monthly Current Affairs s.no. 99.

వరిష్ఠ పెన్షన్ బీమా యోజనకు కేంద్రం ఆమోదం
సామాజిక సాధికారత, సమగ్రత కోసం రూపొందించిన వరిష్ఠ పెన్సన్ బీమా యోజన 2017కు ప్రధాని మోదీ ఆధ్యర్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పదేళ్ల పాటు 8 శాతం రేట్ ఆఫ్ రిటర్న్ హామీతో పెన్షన్ ఇచ్చేందుకు ఈ పథకం ఉపరికస్తుంది. నెలవారీ లేదా త్రైమాసిక లేదా అర్ధవార్షిక లేదా వార్షిక విధానంలోనూ పెన్షన్ తీసుకోవచ్చు. దీనిని ఎల్ఐసీ ద్వారా అమలు చేస్తారు.

5. TSPSC Gurukula PGT-TGT Languages Screenint Test (A series) Q.No. 7: ప్రపంచ హ్యాపీనెస్ నివేదిక2017 ప్రకారం, ఈ కింద తెలిపిన వాటిలో ఏ దేశం ప్రపంచంలో అత్యుత్తమ సంతోష దేశంగా నిలిచింది?

1.ఫ్రాన్స్

2. జర్మనీ

3. నార్వే

4. స్వీడన్

TSPSC KEY: Ans 3.

Answer in Precision Acadamy material: March 2017 monthly Current Affairs s.no. 16.

ప్రపంచంలోనే అతి సంతోషకర దేశంగా నార్వే

ప్రపంచ సంతోష నివేదిక 2017 ప్రకారం.. నార్వే ప్రపంచంలోనే అత్యంత సతోష దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. నార్వే తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్లాండ్, స్విట్జరాలండ్ నిలిచాయి.

భద్రత, స్వేచ్ఛ, ఉదారత, నిజాయతీ, ఆరోగ్యం, ఆదాయం, సుపరిపాలన వంటి అంశాలను సంతోషానికి తోడ్పడే అంశాలుగా పరిగణించి ఈ ర్యాంకులు కేటాయించారు.

అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను విడుదల చేసింది. 2012లో తొలిసారి ఈ నివేదిక విడుదల కాగా, ఇది ఐదోది.